Pan India heroine : తాతేమో పీఎం.. భర్త స్టార్ హీరో.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందంటే?
Pan India heroine : ఈ ఫొటోలో ఉన్న అమ్మకూచిని గుర్తు పట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ ఆమె. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస హిట్లు ఇస్తూ ఆడియెన్స్ ను ఆకర్షిస్తోంది. అందం, అభినయంతో పాటు నార్త్ తో పాటు సౌత్ లో కడా అభిమానులను సంపాదించుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయినట్లు పర్సనల్ లైఫ్ లో కాలేకపోయింది. అందుకే మొదటి వివాహం ఆరు సంవత్సరాలకే డైవర్స్ వరకు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ మూవీస్ లో బిజీ అయిన ఈ బ్యూటీ ఇటీవలే సెకండ్ మ్యారేజ్ చేసేసుకుంది. భార్యతో విడిపోయిన ఒక దక్షిణాది స్టార్ హీరోను కట్టుకుంది. ప్రస్తుతం ఈ జోడి మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మరి ఈ అమ్మకూచి ఎవరో అర్థమై ఉంటుంది. ఆమే స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరి. అక్టోబర్ 28 ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోయిన్ కు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
కాగా, అదితీ రావు హైదరి రాజుల కుటుంబానికి చెందింది. ఆమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ.. హైదరాబాద్ ప్రధానిగా పని చేశారు. మరో తాత (తల్లి తండ్రి) రామేశ్వరరావ్ తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా అదితీకి బంధువే. అదితీ రెండేళ్ల వయస్సులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చింది. అక్కడే పెరిగింది. 2006లో ఇండస్ట్రీలోకి వచ్చిన అదితీ.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. తెలుగులో ఆమె ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’, ‘మహాసముద్రం’ సూపర్ హిట్ అయ్యాయి.
సిద్ధార్థ్ తో వివాహం..
మహాసముద్రం షూటింగ్ సమయంలో నటుడు సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది అదితీ. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జట ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది. అదితీ రావు హిందీ నటుడు సత్యదీప్ మిశ్రాను 2007లో వివాహం చేసుకుంది. ఆరేళ్లకే వీరి బంధం తెగిపోయింది.