Marriages : తండ్రికి నాలుగు పెళ్లిళ్లు.. 40 ఏళ్లు వచ్చిన పెళ్లి వచ్చినా పెళ్లి చేసుకోని స్టార్ కిడ్..

Marriages

Naresh

Marriages : ఒకప్పుడు ఆయన  స్టార్ హీరో. ఆయన తల్లిదండ్రులు కూడా సినీ స్టార్లే. తెలుగు సినిమాను అన్ని రంగాల్లో శాసించిన వారే. అయితే ఆ హీరో పర్సనల్ లైఫ్ కొన్నేళ్ల తర్వాత వివాదాలమయమైంది. తండ్రేమో నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఆయన కొడుకు 40 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. కొడుకు కెరీర్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఆ తండ్రి.  కానీ తండ్రి ఆస్తి విలువ అక్షరాల వెయ్యి కోట్లు. ఈ విషయాన్ని సదరు హీరో ఓ సందర్భంలో చెప్పాడు. హైదరాబాద్ నడిబొడ్డున 12 ఎకరాల పొలం ఉంది. నాలుగు ఎకరాల్లో ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు. మిగతా 8 ఎకరాలను కమర్షియల్ ఏరియాగా డెవలప్ చేశాడు.

మీ నాన్నకు నాలుగు వివాహాలు అయ్యాయి. నీకింకా పెళ్లి ఎందుకు కాలేదని  అడిగితే ఆ హీరో ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటారా? వీకే నరేష్. ఒకప్పటి టాప్ హీరోయిన్ కమ్ డైరెక్టర్ విజయనిర్మల కుమారుడు నరేష్ నాలుగు వివాహాలు అయ్యాయి. ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు నవీన్ విజయ్ కృష్ణ పెద్దవాడు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు.

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో ప్రస్తుతం వివాదం నడుస్తుంది. ఆయన వైవాహిక జీవితం వివాదాస్పదమే. మూడు పెళ్లిళ్లు చేసుకుని విఫలమైన నరేష్  60 ప్లస్ ఏజ్ లో నటి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. అప్పట్లో వీరిద్దరి మధ్య సంబంధం సోషల్ మీడియాలో రచ్చ కెక్కింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారు. తనకు దొరికిన నమ్మకమైన మనిషి పవిత్ర అని నరేష్  చెబతున్నారు.

40 ఏళ్లలో ఉన్న విజయ్ కృష్ణ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో విజయ్ కృష్ణ ను ప్రశ్నించగా వాటిని తాను పట్టించుకోనని సమాధానమిచ్చాడు. అనవసరమైన వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోనని చెప్పాడు. తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు వీరేవరైనా ఆదుకున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఎవరి జీవితం వారిదని, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. ఇంతవరకు మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం ఏమిటని అని ప్రశ్నించగా  కెరీర్ పట్ల ఇప్పుడే క్లారిటీ వచ్చిందని చెప్పాడు. తాను లవ్ లైఫ్ గెలవలేకపోయానని  చెప్పారు. లైఫ్ లోకి రాసి పెట్టి  ఉంటే ఎవరో ఒకరు వస్తారని చెప్పుకొచ్చారు. ఇక నవీన్ కృష్ణ మూడు సినిమాల్లో హీరోగా నటించినా సక్సెస్ మాత్రం రాలేదు.

TAGS