JAISW News Telugu

KCR-KTR : పాత పాటనే పాడుతున్న తండ్రీ కొడుకులు

KCR-KTR

KCR-KTR

KCR-KTR : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ లో ఫలితాలు వెలువడ్డాయి. తిరిగి ఐదు నెలలకే పార్లమెంట్ ఎన్నికల పోరు మొదలైనది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పదేళ్ల రాజభోగం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరిస్థితి చేయిదాటిపోతే పార్టీ కి శంకరగిరి మాన్యాలే దిక్కు.ఇప్పటికే ఉందామా…వెళుదామా అనే సందిగ్ధంలో గులాబీ నాయకులు ఉన్నారు.  కాబట్టి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలనే తపనలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్,  కొడుకు కేటీఆర్ ఉన్నారు. అభ్యర్థులను గెలిపించుకోడానికి వెంపర్లాడుతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లిన నేటికీ పాత పాట నే తండ్రి కొడుకులు పడుతున్నారు.

ఈ అరిగిపోయిన రికార్డు తో ఓటర్లను  ఏ మేరకు తిప్పుకుంటామనేది అభ్యర్థుల్లో ఆలోచనలో పడేసింది..

వైసీపీ నాయకులతో అంటకాగుతూ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకు వస్తారు కేటీఆర్. లేదంటే ఎందుకు పనికిరాని, పసలేని ఆరోపణ చేస్తారు కేటీఆర్. ప్రతిపక్షాలను గెలిపిస్తే హైదరాబాద్ ను యూటీ చేస్తారని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే యూటీ కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. హైదరాబాద్ లో వరదల వలన వచ్చిన నష్టాన్ని ఎదుర్కోలేదు కానీ యూటీ  అని, ఉమ్మడి రాజధాని అంటూ పసలేని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. కానీ పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించి కాపాడుకునే ప్రయత్నం చేయక పోవడంపై గులాబీ శ్రేణులు అసంతృప్తికి లోనవుతున్నారు.

కేసీఆర్ మాత్రం తన పరిపాలంలోనే ప్రజలకు తగినన్ని నీళ్లు,  వర్షాలు పడుకున్నా పంటకు సరిపడేంత నీరు ఇచ్చినా,  రబీలో చెరువులు ఎండిపోయినా సాగు నీరు పుష్కలంగా ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రజలకు ఏ కాలంలో నీళ్లు ఉంటవి, ఏ కాలంలో నీళ్లు ఉండవు అనేది తెలియదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గోదావరి నీళ్ల గురుంచి మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఎండాకాలంలో గోదావరి నదిలో నీళ్ళే లేవు. ఎవరు వచ్చారు. ఎవరు ఎత్తుకెళుతున్నారు అనే ప్రశ్న కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. విద్యార్థుల ప్రశ్న పత్రాలు బయటకు వస్తాయి. పబ్లిక్ సర్వీస్ కమ్మిషన్ ప్రశ్న పత్రాలు బహిరంగమే అవుతాయి. ఉద్యోగుల వేతనాలు 15 తేదికి కుడా సరిగా అందవు. దింతో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తండ్రి కొడుకులకు తెలియదా. ఉద్యోగ నియామకాలు వాయిదా పడితే వాల్లు, వాల్ల కుటుంబాలు మానసికంగా ఎంత అవేదన పడ్డారో వాళ్లకు తెలియదా అంటూ ప్రజలు గతాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో సమస్యలు వచ్చాయంటే , దానికి భాద్యత మీ పరిపాలననే కారణం అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎదురు దాడికి దిగడంతో తండ్రి కొడుకులు త్రిశంకు స్వర్గంలో పడిపోయారు.

Exit mobile version