Road accident in America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

Road accident in America
Road accident in America : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మన దేశానికి చెందినవారు మృతి చెందారు. అందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా, ఒకరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెం.75లో శుక్రవారం వరుసగా 5 వాహనాలు ఒకదానితో ఒకటి అతి వేగంతో ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
మృతులు హైదరాబాద్ కు చెందిన ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్, ఫారూక్ షేక్, పాలచర్ల లోకేశ్, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ గా గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని అధికారులు వెల్లడించారు. వీరి వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.