AP Cabinet : ఏపీలో మంత్రివర్గం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా చూస్తే ఎన్ఎండీ ఫరూక్ (74) అందరికంటే పెద్దవారు కాగా, గజపతివరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్ (40) పిన్న వయస్కుడు.
కొలువుదీరిన మంత్రిమండలి సరాసరి వయస్సు 55 ఏళ్లు. మంత్రివర్గంలో 13 మంది 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారు ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవిత ఉన్నారు. 50 ఏళ్ల లోపు నారా లోకేశ్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాదరెడ్డి, టీజీ భరత్, అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఉండగా, 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వారిలో పి.నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, కందుల దుర్గేష్ ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ లు ఇద్దరూ 70 ఏళ్లకు పైబడిన సీనియర్ నేతలు.