Tummala Nageswara Rao : మేం నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పై విమర్శలు చేశారు. ‘‘మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే మాకు నిరసన సెగ తాకేది. అధికారం కోల్పోయిన బాధ ఒకరిది.. అధికారంలోకి రావాలనే బాధ మరొకరిది. రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించడం లేదా..?’’ అని తుమ్మల ప్రశ్నించారు.