Minister Ponguleti : రైతులారా.. అధైర్యపడొద్దు.. మద్దతు ధర ఇస్తాం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti
Minister Ponguleti : రైతులు అధైర్యపడొద్దని, పంటలకు మద్దతు ధర ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిసెంబరు చివరిలోపు పెండింగ్ లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నార. డిసెంబరులో గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.