JAISW News Telugu

Farmers alert : రైతులు బీ అలర్ట్.. రుణమాఫీపై సైబర్ నేరగాళ్ల కన్ను

Farmers alert

Farmers alert

Farmers alert : సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసగించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రారంభించింది. రుణమాఫీ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

తమకు రుణమాఫీ జరుగుతుందో లేదో అనే రైతుల ఉత్సుకతను అసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రైతుల వాట్సాప్ లోకి ఏపీకే ఫైల్స్ లింకులు, మేసేజ్ లు పంపుతున్నారని సమాచారం. దీంతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెప్పవద్దన్నారు. సైబర్ ఎటాక్ విషయంలో ఏదైనా ఫిర్యాదులు ఉంటే 1930 కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Exit mobile version