Anushka:అనుష్క శర్మ చాలా కాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉంది. మొదటి బిడ్డ వామికకు జన్మనిచ్చాక తిరిగి నటనలోకి రాలేదు. అందుకే తను నటించిన సినిమా రిలీజై చాలా కాలమే అయింది. నాలుగేళ్ల క్రితం షారూఖ్ జీరో విడుదలైంది. ఆ తర్వాత అనుష్క శర్మకు వేరొక సినిమా లేదు. అయితే ఇటీవలే ప్రపంచకప్ మ్యాచ్ లలో అనుష్క శర్మ సందడి చేస్తూ కనిపించింది.
మరోవైపు అనుష్క శర్మ రెండో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా అనుష్క శర్మ బంగారు వర్ణం చీరను ధరించి బేబి బంప్ పై చేయి ఉంచిన ఫోటో ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో ఫ్రేమ్ లో విరాట్ ట్రెడిషనల్ అవతార్ లో కనిపించాడు. అయితే ఇది లేటెస్టుగా షేర్ అయిన ఫోటోయేనా? అన్నది ఆరా తీస్తే.. నిజానికి ఇది త్రోబ్యాక్ ఫోటో అని తెలిసింది. 2018లో దీపావళి జరుపుకున్నప్పటి ఫోటో అది. ఆ తర్వాత వామికకు ఈ జంట జన్మనిచ్చారు.
ఇది దీపావళి సందర్భంగా తీసిన ఫోటో. అనుష్క శర్మ- విరాట్ ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తున్నారు ఈ ఫోటోగ్రాఫ్ లో. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇప్పుడు ఆ పాత ఫోటోనే కొత్తగా వైరల్ చేస్తున్నారు. దీంతో విషయం ఏమిటో క్లారిటీ వచ్చింది. అనుష్క రెండో ప్రెగ్నెన్సీపై అభిమానుల అత్యుత్సాహం బయటపడింది. నిజానికి సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో గోప్యత లేకుండా పోతోందని కలత చెందుతున్నారు. ఇప్పటికీ అభిమానులు మారలేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అనుష్క శర్మ రెండో ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేయకపోయినా కానీ పలుమార్లు విరాట్ తో కలిసి విమానాశ్రయాల్లో కనిపించినప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిలో అనుష్క బేబి బంప్ ని అభిమానులు కనుగొన్నారు. ఇంతకుముందు గైనకాలజీ డాక్టర్ క్లినిక్ నుంచి బయటికి వెళుతూ ముంబై మీడియా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత రెండో ప్రెగ్నెన్సీ మ్యాటర్ బయటికి వచ్చింది. అప్పటి నుంచి మీడియా జనం, అభిమానులు ఈ జంట వెంటపడుతున్నారు. నిరంతరం అనుష్క ప్రెగ్నెన్సీ కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.