Naga Chaitanya Dhoota : విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన నాగ చైతన్య తాజా వెబ్ సిరీస్ ‘ధూత’ ఒక సూపర్ నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్. ఈ సిరీస్ ప్రకటన అభిమానుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఒకింత నిరాశ కూడా నింపింది.
ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్, ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అనుమతులు తీసుకుంది. ‘అరిష్ట వార్తా పత్రిక క్లిప్పింగ్‌లు విషాద ఘటనలను ప్రవచించడంతో అతని జీవితం చీకటి మలుపు తిరుగుతున్న జర్నలిస్ట్ సాగర్ (నాగ చైతన్య)’ చుట్టూ తిరుగుతుంది. పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, మరియు ప్రియా భవానీ శంకర్ వంటి తారాగణం ఇందులో నటిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో OTT ప్లాట్ఫారం, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్‌కు ఇప్పటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం ‘ధూత’పై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. నాగ చైతన్య గతేడాది విక్రమ్ కుమార్‌తో కలిసి చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అతను మళ్లీ ఆయనతోనే ‘ధూత’ చేశాడు.
అయితే, దీన్ని సినిమాగా తీసి థియేటర్లలో రిలీజ్ చేయాల్సి వస్తే బాగుండేదని చై అభిమానులు కోరుతున్నారు. కానీ ఇది వెబ్ సిరీస్ కావడంతో థియేటర్లలో రిలీజ్ చేయడం కుదరదు. దీంతో చై అభిమానులు తమ ఆశలపై నీళ్లు చల్లాడని చైపై కొంచెం గుస్సవుతున్నారు.