PM Modi : పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు. యూపీలోని అజంగడ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
‘‘భారత్ కు వచ్చిన శరణార్థులను సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నార. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తోంది. కానీ, సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ప్రధాని దుయ్యబట్టారు.