JAISW News Telugu

Shreyas Iyer : బ్యాటింగ్ లో విఫలమైనా..శ్రేయాస్ సూపర్ ఫీల్డింగ్.. వీడియో వైరల్

Shreyas super fielding.. Video viral

Shreyas super fielding Video viral

Shreyas Iyer : విశాఖ టెస్టులో టీమిండియా దుమ్మురేపింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్ లో భారత యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (209), గిల్ (104) పరుగులతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో బుమ్రా 9 వికెట్లు తీసి ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ఇక టీమిండియా ఈ టెస్టులో ఫీల్డింగ్ లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఔరా అనిపించాడు. బ్యాటింగ్ లో విఫలమైనా ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించాడు.

ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో శ్రేయస్ అయ్యర్ 35,13 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 56 పరుగులు మాత్రమే చేశాడు. గత 11 ఇన్నింగ్స్ లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ధాటిగా ప్రారంభిస్తున్నా.. ఆటను నిలుపుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో అతి ప్రధానమైన ఓపిక అతడికి ఉండడం లేదని, అందుకే వికెట్ పారేసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫీల్డింగ్ లో మాత్రం అదుర్స్ అనిపించడం మాత్రం కొసమెరుపు.

అశ్విన్ వేసిన 53వ ఓవర్ 4వ బంతి బెన్ స్టోక్స్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. మిడ్ వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన శ్రేయాస్ డైరెక్ట్ హిట్ తో రనౌట్ చేశాడు. దీంతో స్టోక్స్ నిరాశగా పెవిలియన్ కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట్లో వైరల్ అయ్యింది.

తొలి ఇన్నింగ్స్ లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76)ను అద్భుత క్యాచ్ తో శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్రాలే షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. బ్యాక్ వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్.. వెనక్కి పరుగెత్తి డ్రైవ్ చేసి మరీ బంతిని అందుకున్నారు. విశాఖ మ్యాచ్ లో శ్రేయాస్  56 పరుగులు మాత్రమే చేసినా.. విలువైన ఫీల్డింగ్ చేశాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Exit mobile version