Fact check : బెట్టింగ్ లో మోసపోయినోళ్లకు ఆరా మస్తాన్ సంచలన పిలుపులో నిజమెంత?

Fact check : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి నేషనల్ ఛానళ్లు అన్నీ కూటమి అధికారం చేపడుతుందని చెప్తే.. ఆరా మస్తాన్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సంస్థ 2014లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పాయి. అయినా ఖచ్చితమైనదిగా మార్కెట్ చేయడానికి ప్రయత్నించింది. తమది విశ్వసనీయ సంస్థ అని జగన్ నే గెలుస్తాడని అందరినీ నమ్మించింది.

ఆరా మస్తాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేను వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్, కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ)కి చెందిన ముఖ్య నేతలు పోటీ చేస్తున్న సుమారు 40 నియోజకవర్గాల నివేదికను ఇచ్చారు. వల్లభనేని వంశీ గన్నవరంలో గెలుస్తున్నారని చెప్పాడు. ఆరా రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశమైన టాప్ 5 నియోజకవర్గాల్లో ఉన్న గుడివాడలో కొడాలి నాని గురించి ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో బెట్టింగ్ ఫేవరెట్ సీట్లలో ఇది కూడా ఒకటి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. గుడివాడలో టఫ్ ఫైట్ నెలకొంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ లో చెప్పలేనని ఆరామస్తాన్ చెప్పారు. నాని, వంశీలను ఓడించేందుకు ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు వచ్చి నియోజకవర్గంలో పనిచేశారని మస్తాన్ అన్నారు.

అయితే ఆరా మస్తాన్ ను నమ్మి వైసీపీ అభిమానులు లక్షల రూపాయలను బెట్టింగ్ కాశారు. కానీ వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు నిండా మునిగి ఆస్తిపాస్తులు అమ్ముకునేంతగా దిగజారిపోయారు.

ఈ క్రమంలోనే ఆరామస్తాన్ పై ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. అందులో ఏముందుంటే.. ‘కొన్ని వేల మంది నేను చెప్పింది నమ్మి బెట్టింగ్ వేసి మోసపోయారు. జగన్ గారే నాతో అలా చెప్పించారు. కనుక డబ్బులు పోగొట్టుకున్న వైసీపీ అభిమానులు జగన్ దగ్గరకు వెళ్లి మీ డబ్బులను వసూలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఆరా మస్తాన్ పేరుతో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే అది ఆరామస్తాన్ అధికారికంగా చేసింది కాదని.. ఎవరో కావాలనే వైసీపీ వ్యతిరేకులు సృష్టించిందని సమాచారం. ఆరా మాస్తాన్ ఎలాంటి ప్రకటన చేయలేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. అదంతా ఫేక్ అని నమ్మవద్దని కోరుతున్నారు.

TAGS