Anand Mahindra : భారత వ్యాపార దిగ్గజం ‘ఆనంద్ మహింద్రా’ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. తన ఎక్స్(ట్విటర్) అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన అంశాలను పంచుకుంటూ ఉంటారు. ప్రపంచంలో జరిగే విశేషాలను అందిస్తూ ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆయన పెట్టే వీడియాలపై స్పందన కూడా విపరీతంగా ఉంటుంది. ఆయన వీడియోలు, ట్వీట్ ల కోసం ఎదురు చూసే వారు కూడా ఉంటారు. తన ఫాలోవర్లు ఏదైనా ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు కూడా ఇస్తుంటారు. దీంతో అంతటి బిజీ పర్సన్ అయినా ఇంత కూల్ గా ఉండడంపై నెటిజన్లు ప్రశంసలు కూడా కురిపిస్తుంటారు.
తాజాగా ఆనంద్ మహేంద్రా షేర్ చేసిన ఓ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందులో ఓ మదపుటేనుగు అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదికి పరుగెత్తుకుంటూ వస్తుంది. అలా ఓ పెద్ద ఏనుగు మీదికొస్తుంటే ఎవరైనా సహజంగానే భయపడుతారు. కానీ అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు మాత్రం అస్సలు భయపడకుండా ధైర్యంగా నిలబడి ఉంటారు.
దీంతో ఆ ఏనుగు వేగంగా వారి ముందుకు వచ్చి తర్వాత వెనక్కి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్లే అయ్యే సమయంలో భయానికి రెండు అర్థాలు ఉన్నాయని.. ఒకటి అన్నీ మరిచిపోయి పరుగెత్తడం.. రెండు అన్నింటిని ఎదుర్కొని నిలబడడం అని కనిపిస్తుంది.
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహేంద్రా ‘‘మీ భయాన్ని ఎదుర్కొండి’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు. లైక్ లు చేశారు. కొందరు నెటిజన్లు తమదైన రీతి కామెంట్స్ కూడా పెడుతున్నారు.
Face your fear.
Look at it straight in the eye and it will turn away. #MondayMotivation pic.twitter.com/0RDvH2i9il— anand mahindra (@anandmahindra) January 15, 2024