High Court : వివాహేతర సంబంధం నేరం కాదు: హైకోర్టు

High Court : తన భార్య ప్రియుడిపై భర్త వేసిన కేసును కొట్టి వేస్తూ, దిల్లీ హైకోర్టు ఈ నెల 17న అతనికి విముక్తి కల్పించింది. వివాహేతర సంబంధం నేరం కాదని, ఇది నైతికతకు చెందిన విషయం మాత్రమేనని న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ స్పష్టం చేశారు.

భార్యను భర్త ఆస్తిగా పరిగణించే భావనకు ఇక స్థానమే లేదని ఆమె పేర్కొన్నారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉదహరిస్తూ, ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని గుర్తు చేశారు. దీంతో ప్రియుడికి హైకోర్టులో ఊరట లభించింది.

TAGS