Extra ordinary Man:`ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్` మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

Extra ordinary Man:వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరో నితిన్‌. గ‌త ఏడాది `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా 2022, ఆగ‌స్టు 12న విడుద‌లై హీరో నితిన్‌కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా త‌రువాత ఎలాగైనా సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లోప‌డిన నితిన్ కామెడీ యాక్ష‌న్ డ్రామాని ఎంచుకున్నాడు. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా ఎంట‌ర్ టైన‌ర్ `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌`.

హీరోగా నితిన్‌కిది 32వ సినిమా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.శ్రీ‌లీల క‌థానాయిక‌గా న‌టించిన ఈ మూవీలో డా. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నితిన్ తొలి సారి జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ సినిమాని ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్ టైన్ చేయాల‌నే ల‌క్ష్యంతో రూపొందించామ‌ని, సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు క‌చ్చింత‌గా ఎంజాయ్ చేస్తార‌ని హీరో నితిన్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే ఈ శుక్ర‌వారం నితిన్ న‌టించిన `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్` సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ సినిమాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో హీరో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. ఈ పాత్ర‌లో నితిన్ నూటికి నూరు శాతం సెట్ట‌య్యాడ‌ని, అంతే కాకుండా నితిన్ కామెడీ టైమింగ్ బాగుంద‌ని కామెంట్‌లు చేస్తున్నారు. ఫ‌స్ట్ హాఫ్ పేరుకు త‌గ్గ‌ట్టే ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంద‌ని, శ్రీ‌లీల‌, నితిన్‌ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ చాలా క్యూట్‌గా ఉంద‌ని, అలాగే తండ్రిగా రావు ర‌మేష్ క్యారెక్ట‌ర్ న‌వ్వులు పూయిస్తోంద‌ని అంటున్నారు.

పూర్తి స్థాయి వినోదాత్మ‌కంగా సినిమా ఉంద‌ని, డా. రాజ‌శేఖ‌ర్ పాత్ర నిడివి త‌క్కువే అయినా ఆక‌ట్టుకుంటార‌ని తెలిపారు. ఇక సెకండ్ హాఫ్ ఆద్యంతం ఫ‌న్‌గా న‌డిచింద‌ని, నితి్‌కు మంచి హిట్ ల‌భించిన‌ట్టేన‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌`పైసెటైర్లు వేస్తున్నారు. అంతా సంపూర్ణేష్ బాబు సినిమా ఉంద‌ని, చాలా సీన్‌లు స్ఫూఫ్‌లుగా ఉన్నాయ‌ని సెటైర్లు వేస్తున్నారు.

TAGS