Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలోనూ దోపిడీ.. జగన్ సర్కార్ పై టీడీపీ మండిపాటు
Ambedkar Statue : మహనీయుల విగ్రహాలు పెట్టడం వల్ల వారిని మనం స్మరించుకునే అవకాశం ఏర్పడుతోంది. వారిని సదా గౌరవించినట్టు ఉంటుంది. వారి గొప్పతనం, వారు సాధించిన విజయాలు, వారి నడవడిక భవిష్యత్ తరాలకు తెలియడానికి, అలాగే వారిని ఇన్సిపిరేషన్ తీసుకునేలా ఉండడానికి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఓకే మంచిదే. ఇక అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి విగ్రహం పెడితే దానికి మించిన ఆనందం ఏముంటుంది.
కానీ ఇదే విషయం ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. రాజ్యాంగ నిర్మాత అతిపెద్ద విగ్రహాన్ని సీఎం జగన్ జనవరి 19న విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరించారు. ఈ విగ్రహంతోపాటు స్మృతి వనాన్ని ప్రారంభించారు. వీటికి గానూ ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించింది.
ఈ విషయం ప్రతిపక్ష టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహ సైజులోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం సైజు ఉందని, దానికి 150 కోట్ల ఖర్చు అయితే..ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మాత్రం 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని చెప్తూ భారీ అవినీతికి పాల్పడిందని అంటున్నారు. అంబేద్కర్ విగ్రహం పేరిట భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే విగ్రహంతో పాటు కన్వెన్షన్ సెంటర్, 4 హళ్లు, డిజిటల్ మ్యూజియం, వాటర్ మ్యూజికల్ ఫౌంటెన్ల వల్ల ఖర్చు ఎక్కువైందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
అయితే ఏరకంగా చూసినా అంత ఖర్చు కాదని.. అందులో భారీ అవినీతి జరిగిందని అంటున్నారు. 150 కోట్లు ప్రధాన నిర్మాణమైన విగ్రహానికి ఖర్చు అయితే..అనుబంధ నిర్మాణాలకు రూ.250 కోట్లు ఖర్చు కావడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.