Traffic Challan : తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ గడువు నేటితో ముగియనున్నది. గత డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేం దుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యా ప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1.14 కోట్ల చలాన్లు క్లియర్ అయిన ట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఇప్పటి వరకు 100.5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాగా అత్యధి కంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్ కాకా వీటి ద్వారా 57.53 కోట్ల రాబడి వచ్చింది.
ఇంకా 2.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికా రులు తెలిపారు. అయితే పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనదారులు ఈ-చలాన్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. సర్వర్ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టెందుకు ఎక్కవ సమయం పడుతోంది. దీంతో ఈ గడువును పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు.
దీంతో ఈ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలు స్తోంది. కాగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2022 లో మార్చి 1 నుంచి 31 వరకు రాయితీ కల్పించింది. ఆ తర్వాత మరో 15 రోజుల పాటు చలాన్లపై గడువు పొడిగించింది.