JAISW News Telugu

CS Neerabh Kumar : సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు.. కేంద్రం ఉత్తర్వులు

FacebookXLinkedinWhatsapp
CS Neerabh Kumar

CS Neerabh Kumar

CS Neerabh Kumar : ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. కాా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సీఎస్ గా నీరభ్ కుమార్ జూన్ లో బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో ఇటీవల ప్రభుత్వం ఆయన సర్వీసును పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసింది.  ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

నీరభ్ కుమార్ ప్రసాద్ సీఎస్ కావడానికి ముందు రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1990లో తూర్పు గోదావరి సబ్ కలెక్టర్, 1991లో ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగా పనిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జేసీగా, 1996లో ఖమ్మం కలెక్టర్ గా, 1998లో చిత్తూరు కలెక్టర్ గా సేవలందించారు. 1999లో యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్, శాప్ ఎండీగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి ఎండీగా, 2007లో పరిశ్రమల శాఖ కమిషనర్ గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్ గా పనిచేశారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ గా బాధ్యతు చేపట్టారు.

2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా, 2015లో వైటీసీఏ ముఖ్య కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు. 2017లో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2018లో టీఆర్అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం ఏపీ సీఎస్ గా విధులు నిర్వర్తించారు.

Exit mobile version