JAISW News Telugu

Nandigam Suresh : మాజీ ఎంపీ నందిగం సురేశ్ రిమాండ్ పొడిగింపు

Nandigam Suresh

Nandigam Suresh

Nandigam Suresh : వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని రెండోసారి కోర్టును ఆశ్రయించగా.. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కోర్టు, తీర్పును రిజర్వు చేసి ఈ నెల 4కు వాయిదా వేసింది. దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేశ్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మాజీ ఎంపీ నందిగం సురేశ్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజుల పాటు ఆయన రిమాండ్ పొడిగించినట్లు కోర్టు తెలిపింది. అయితే బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేయగా.. రేపు ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతుందోననే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

Exit mobile version