Nandigam Suresh : మాజీ ఎంపీ నందిగం సురేశ్ రిమాండ్ పొడిగింపు

Nandigam Suresh
Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల రెండు రోజుల విచారణలో భాగంగా నందిగం సురేశ్ కు 45 ప్రశ్నలు వేసి పోలీసులు సమాచారం రాబట్టారు. అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉందని, దానికి హాజరుకావాలని సమాచారమివ్వడంతో అక్కడికి వెళ్లానని బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి కుట్ర జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు.