JAISW News Telugu

Kishan Reddy : యాదాద్రికి ఎంఎంటీఎస్ సర్వీస్ పొడిగింపు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ తో రాష్ట్ర ఎంపీల సమావేశం అనంతం రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుద్దీకరణ జరిగిందని తెలిపారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. వరంగల్ లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్ ను పెంచామన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరిన్ని తీసుకొస్తామని వెల్లడించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామన్నారు.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి రూ.650 కోట్లు అవసరమని చెప్పారు. ఘట్ కేసర్ వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ సర్వీసు ఉందని, అక్కడి నుంచి యాదాద్రి వరకు విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకున్నా ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేశ్ రెడ్డి, కావ్య, డీకే అరుణ, రఘునందన్ రావు పాల్గొన్నారు.

Exit mobile version