TDP : టీడీపీ గెలుపు కోసం ప్రవాసాంధ్రులు పాటుపడాలి

Expatriates should support TDPs victory
TDP : 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నారై టీడీపీ పిలుపునిచ్చింది. శుక్రవారం సీబీఎన్ ఫోరమ్ విజన్ 2024 ఆధ్వర్యంలో మన రాష్ట్రం – మన భవిష్యత్ పేరిట కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా సభలో పాల్గొన్ని కోమటి జయరాం మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీకి సహకరించాలని ఆకాంక్షించారు. కార్యకర్తల మధ్య ఐక్యత ఉండాలన్నారు. అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని గెలిపించడమే ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. కమిటీ ఏర్పాటుకు కిరణ్, యూకే నుంచి అనుమోలు చోనిత పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
వైసీపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం కామన్ అయిపోయిందన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అవసరాన్ని గుర్తించాలన్నారు. విజన్ చేరుకోవడానికి చంద్రబాబును గెలిపించడమే మార్గమని సూచించారు. ఆయన గెలుపుకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు కుంభంపాటి బష్వంత్, ద్రోణపల్లి దుర్గ పార్టీ భవిష్యత్ కోసం పనిచేయాలన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేసీ చేకూరి, చలసాని కిషోర్, దిలీప్ కుమార్ చంద్ర, పోలవరం శ్రీకాంత్, సుగన్ దాగర్లమూడి, లోకేష్ నాయుడు పాల్గొన్నారు.