TDP and YCP : 24వ తేదీపైనే ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీలు ఏం బాంబ్ పేల్చనున్నాయి..?
TDP and YCP : ఈనెల 24న అంటే రేపు టీడీపీ, వైసీపీలు ఏం ప్రకటన చేయనున్నాయనే ఆసక్తి ఏపీలో నెలకొంది. వాస్తవానికి ఈ విషయమై మొదటగా టీడీపీ ఓ పోస్టరు రిలీజ్ చేసింది. అంటే టీడీపీ ఏదో కీలక నిర్ణయం ప్రకటించబోతోందని అందరూ భావించారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొందరు భావిస్తున్నారు. అయితే ఇదే తరహాలో వైసీపీ కూడా ఓ పోస్టరు విడుదల చేసింది. దీంతో జనంలో చర్చలు జోరందుకున్నాయి. ఏం జరగనుందనే ఆసక్తి చోటుచేసుకుంది. ఈరోజు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేసి జగన్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒక కమిటీకి చెందిన నాయకురాలు రాజీనామా చేయడం, ఆమె తీవ్రమైన ఆరోపణలు చేయడం చూస్తుంటే రేపు వైసీపీకి చెందిన ఎవరో ముఖ్యనేత టీడీపీలో చేరే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.