Jimmy Carter Wife Death : అమెరికా మాజీ అధ్యక్షుడికి సతీ వియోగం.. మరణించిన జిమ్మి కార్టర్ భార్య రోజ్లిన్ కార్డర్..

Jimmy Carter Wife Death

Jimmy Carter Wife Death

Jimmy Carter Wife Death : అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య (సతీమణి) రోజ్లిన్ కార్టర్ (96) ఆదివారం (నవంబర్ 19) తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు యూఎస్ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ ‘నా విజయం వెనుక రోజ్లిన్ కార్టర్ ఉంది, నేను నిరాశకు లోనైతే ఆమె ఓదార్చేది. నిరంతరం సలహాలు ఇచ్చేది. ఆమె నా ఉత్తమ సహాదారు’ అని చెప్పారు.

2022, మేలో ఆమె డిమెన్షియా అనే వ్యాధికి గురైంది. ఈ వ్యాధితో ఏడాదికిపైగా పోరాడింది. 2023, ఫిబ్రవరి నుంచి వైద్యులు ఆమెకు ఇంట్లోనే చికిత్స చేస్తున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ గా జిమ్మి కొనసాగుతున్న కాలంలో ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో సఫలీకృతడయ్యారు. దీని ఫలితంగా ఆయన ప్రపంచ వేదికపై ప్రశంసలు పొందారు. ద్రవ్యోల్బణం, ఇరాన్ వివాదాలు ఆయనను విమర్శల పాలు చేశాయి. రెండు సందర్భాల్లో ఆయనకు తోడుగా రోజ్లిన్ నిలిచారు.

వరల్డ్ పీస్, హ్యూమన్ రైట్స్ కోసం కార్టర్-రోజ్లిన్ కార్టర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జిమ్మీ ఓడిపోయిన తర్వాత కార్టర్ జంట క్యూబా, సూడాన్, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1999 అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కార్టర్ దంపతులకు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ఇచ్చి గౌరవించారు.

జీవితంలో అన్ని దశల్లో తోడున్న తన భార్య రోజ్లిన్ మరణించడంతో కార్టర్ కుంగిపోయారు. కాల చక్రంలో మరణం తప్పదని అనుకున్నా.. మనసుకు దగ్గరగా ఉన్న వాళ్లు మరణిస్తే ఆ బాధ వర్ణణాతీతం అన్నారు.

TAGS