Bihar : బీహార్ లో మాజీమంత్రి తండ్రి దారుణ హత్య

 Bihar

Bihar

Bihar : బీహార్ లో ఓ మాజీమంత్రి తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. వికాస్ శీల్ ఇన్ సాన్ పార్టీ అధ్యక్షుడు ముకేశ్ సహానీ తండ్రిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన బీహార్ లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..

మాజీమంత్రి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహానీ తండ్రి జితన్ సహానీ దర్భంగాలోని సుపాల్ బజార్ లోని తమ నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం మంచంపై అతడి మృతదేహం పడిఉంది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు ప్రత్యే బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముంబైలో ఉన్న ముఖేశ్ సహానీ తన తండ్రి హత్య సమాచారంతో వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్లారు.

TAGS