JAISW News Telugu

MallaReddy:భూక‌బ్జా ఆరోప‌ణ‌లు..కోర్టులో తేల్చుకుంటామ‌న్న మ‌ల్లారెడ్డి

Ex Minister MallaReddy:భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై మాజీ మంత్రి, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి స్పందించారు. భూక‌బ్జాల‌పై త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం వాస్త‌వ‌మేని, అయితే త‌న‌పై న‌మోదైన కేసు విష‌య‌మై కోర్టును ఆశ్ర‌యిస్తాన‌న్నాని స్ప‌ష్టం చేశారు. గిరిజ‌నుల భూములు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తుమ్మ మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో శామీర్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌లో మ‌ల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.

శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మేడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మూడు చింత‌ల‌ప‌ల్లి మండ‌లం, కేశ‌వ‌రం గ్రామంలోని స‌ర్వేనంబ‌ర్ 33, 34, 35లో గ‌ల 47 ఎక‌రాల 18 గుంట‌ల ఎస్టీ (లంబాడీ) వార‌స‌త్వ భూమిని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, అతి బినామీ అనుచ‌రులు 9 మంది అక్ర‌మంగా క‌బ్జా చేసి కుట్ర‌తో మోస‌గించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌లో మ‌ల్లారెడ్డిపై ఫిర్యాదు న‌మోదైంది.

మొత్తం 47 ఎక‌రాలు క‌బ్జా చేశార‌ని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మ‌ల్లారెడ్డితో పాటుఅత‌ని అనుచ‌రులు, మ‌ల్లారెడ్డి బంధువు శ్రీ‌నివాస్ రెడ్డి, కేశ‌వాపూర్ గ్రామ మాజీ స‌ర్పంచ్ గోనె హ‌రి మోహ‌న్‌రెడ్డి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా (డీసీఎంఎస్‌) జిల్లా స‌హ‌కార సంఘం వైస్ చైర్మ‌న్ శామీర్‌పేట్ మండ‌లం వ్య‌వ‌సాయ స‌హ‌కార సేవా సంఘం చైర్మ‌న్ రామిడి మ‌ధుక‌ర్ రెడ్డి శివుడు, స్నేహా రామిరెడ్డి, రామిడి ల‌క్ష్మ‌మ్మ‌, రామిడి నేహారెడ్డిల‌పై శామీర్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు 420 చీటింగ్ కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు.

Exit mobile version