JAISW News Telugu

Konatala Ramakrishana : త్వరలో జనసేనలోకి మాజీ మంత్రి ‘కొణతాల’

Konatala Ramakrishana into janasena

Konatala Ramakrishana to join janasena

Konatala Ramakrishana : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన విజయం కోసం తపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన మనసులోని మాట ప్రకటించారు. జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్లు తేల్చేశారు.

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కొణతాల రామక్రిష్ణ నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మంచి నేతగా పేరుతెచ్చుకున్న ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన 1989 నుంచి 1996 వరకు అనకాపల్లి ఎంపీగా పనిచేశారు.

వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల తరువాత కొణతాల రామక్రిష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొణతాల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2004 నుంచి 2009 వరకు వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. జనసేనకు వస్తున్న ఊపుతో ఇప్పుడు అందులో చేరాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాలని అనుకుంటున్నారు. దీంతోనే పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. త్వరలోనే ఆయన జనసేనలోకి వస్తారని చెబుతున్నారు.

Exit mobile version