Heart attack : మాజీ సీఎంకు హార్ట్ స్ట్రోక్.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన
heart attack : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఆరోగ్యం ఉదయం క్షీణించింది. హార్ట్ స్ర్టోక్ రావడంతో వెంటనే యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించారు. ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులో అడ్డంకులు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించి వెంటనే యాంజియోప్లాస్టీ చేయించారు. ప్రస్తుతం థాకరే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఏం జరిగింది?
సోమవారం ఉదయం 8 గంటలకు ముంబైలోని ప్రముఖ హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ఉద్ధవ్ థాకరేకు యాంజియోప్లాస్టీ చేశారు. ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అడ్డంకి ఉందని గుర్తించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైద్యుల బృందం యాంజియోప్లాస్టీ చేశారు.
ఆదిత్య ఠాక్రే ట్వీట్ ?
శివసేన (యూబీటీ) నాయకుడు, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తన తండ్రి ఆరోగ్యగంపై ఎక్స్ లో ట్వీట్ చేశాడు. హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో సర్జరీ పూర్తయ్యింది, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో కోలుకుంటున్నారని, ప్రజలకు సేవ చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.