Ex CM KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొనగా.. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని ఏజీ తెలిపారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ేజీ వాదనలతో ఏకీభవించింది. కేసీఆర్ పిటిషన్ కొట్టేస్తూ విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.
విద్యోత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాల విషయంలో తమ ప్రభుత్వం అన్ని పద్దతిగా చేసిందనీ, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేని చెబుతూ కేసీఆర్ ఇటీవల 8 పేజీల లేఖను కమిషన్ కు పంపారు. అంతేకాదు, కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.