Venkatalakshmi : మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత నెల 23న ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ మెమో అమలును నిలుపుదల చేయాలంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం గజ్జల వెంకటలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను కొట్టివేసింది. వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఉద్వాసన పలికింది.