AP Elections 2024 : ఎటు చూసినా దాడులు, దౌర్జన్యాలే.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేనా?

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎటు చూసినా దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు నిత్యం జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు పరిస్థితి దయనీయంగా మారింది. జగన్ ప్రభుత్వ దమనకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. దుడ్డున్నోడిదే బర్రె అన్నట్లుగా మారుతోంది.

ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? దారుణాలు జరుగుతుంటే మౌనంగా ఉండటం దేనికి సంకేతం? ఏ ఒక్క అధికారిపై కూడా వేటు వేయడం లేదు. నిజాయితీగా వ్యవహరించే వారే కనిపించడం లేదు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి పని చేయడం లేదని తెలుస్తోంది. కానీ ఏపీలో అధికార యంత్రాంగం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది.

పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అభ్యర్థిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే స్టేషన్ పైనే దాడి చేశారు. 11 వాహనాలను తగులబెట్టారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం కనీసం చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఇలా ఏపీలో ఏ ఊరు చూసినా దౌర్జన్యాలే దర్శనమిస్తున్నాయి.

ఈనేపథ్యంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే రాక్షస పాలన గుర్తుకు వస్తోంది. ఎంతటి వారైనా ఎదురొస్తే దాడులే. అడ్డుకుంటే దౌర్జన్యమే. ఇంకా చెప్పినట్లు వినకపోతే హత్యలకు కూడా వెనకాడటం లేదు. దీంతో ఏపీలో రాజకీయం దారుణంగా మారింది. అందుకే జగన్ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని అనుకుంటున్నారు.

దీంతో ఏపీలో ఎన్నికలు సజావుగా సాగుతాయనే ఆశలు కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా గుండాగిరి పాలన సాగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అంతే సంగతి. వారి నోరు మూత పడాల్సిందే. అడుగడుగునా అవాంతరాలు ఎదురు కాకుండా నిత్యం పహారా కాస్తున్నారు. ఎవరు నోరు మెదపకుండా చేస్తున్నారు.

TAGS