Jagan Secret Behind AP GOs : దేశంలోని ఏ రాష్ర్టంలో అందనంత పారదర్శక పాలన ఏపీలో అందుతున్నదని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతుంటారు. అయితే ఆచరణలో మాత్రం వేరే కనిపిస్తూ ఉంటుంది. ఏపీలో జగన్ సర్కారు విడుదల చేసే జీవోలన్నీ దాదాపు రహస్యంగానే ఉంటాయనే టాక్ ఉంది. ఎందుకంటే అందులో 99 శాతం పబ్లిక్ డొమైన్ లో కనిపించవు. అన్ని రికార్డుల్లోనే భద్రపరుస్తుంటారు. బయట ప్రతిపక్షాలకు కూడా తెలియకుండా ఆయన ప్రభుత్వం జాగ్రత్త పడుతూ ఉంటుంది.
అయితే ప్రభుత్వం విడుదల చేసే ఏ ఉత్తర్వులు అయినా పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా జీవోఐఆర్ వెబ్ సైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వెబ్ సైట్ ను జగన్ రెడ్డి సర్కారు మూసివేసింది. నాటి నుంచి ప్రభుత్వం విడుదల చేసే జీవోలన్నీ రహస్యంగానే ఉంటున్నాయి. దీనిపై హైకోర్టుల్లో విచారణ జరిగినప్పుడు మాత్రం తాము వెబ్ సైట్ లో పెట్టమని ఉత్తర్వులిచ్చామని చెబుతుంటారు. ఆ తర్వాత తప్పించుకుంటారు.
అయితే పారదర్శక పాలన ను బయటకు చెప్పుకోవడంలో తప్పేముంటుందని, అలా రహస్యంగా జీవోలు విడుదల చేయాల్సి న అవసరం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ రికార్డుల్లో భద్రం అనే దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెబుతున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఈ రికార్డులన్నీ ఒక్కసారిగా తగలబెట్టేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా దీనంతటికీ వెనుక ఉండి నడిపిస్తున్న అధికారులు మాత్రం దీనికి బాధ్యులు కాకతప్పదనే అభిప్రాయం వినిపిస్తున్నది.