JAISW News Telugu

Hyderabad News : అంతా అపరిశుభ్రం.. మాదాపూర్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Hyderabad News

Hyderabad News

Hyderabad News : హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం మాదాపూర్ లోని నారాయణ సొసైటీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. దోశ ప్యాన్ అపరిశుభ్రంగా చిలుము పట్టి ఉండడాన్ని అధికారులు గమనించారు.

ఆహార పదార్థాలను గ్రైండింగ్ చేసే ప్రాంతం, వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం, హోటల్ రెస్టారెంట్ల అందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హెచ్చరించారు.

అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. షార్ట్ టర్మ్ లో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడితే కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. నిల్వ చేసిన ఫుడ్ ను తిరిగి వేడి చేయడం ద్వారా అందులో తయారైన బ్యాక్టీరియా చనిపోయి విష పదార్థాలను విడుదల చేస్తుందని, అది తింటే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు డయేరియా వస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version