Tribes of Bastar : మన దేశంలో అమ్మాయిలను, అబ్బాయిలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారు పెడతోవ పట్టకుండా వారి ప్రవర్తనను గమనిస్తుంటారు. ఇక పెళ్లి కాక ముందు యువతీ యువకులు ఏకాంతంగా కలువడం కూడా నిషిద్ధం. అయితే కొన్ని తెగల్లో మాత్రం పెద్దలే దగ్గరుండీ దీనిని ప్రోత్సహిస్తారు. దీన్నొక సంప్రదాయంగా వారు పాటిస్తున్నారు. అదెక్కడో..ఆ విశేషాలెంటో తెలుసుకోండి మరి..
ఛత్తీస్ గడ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. వీరి ఆచారాలు, సంప్రదాయాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనదేశంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడడం పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం ఇది సాధారణం. ప్రేమికులు కలిసి తిరగడం, శృంగారంలో పాల్గొనడం.. అందరికీ తెలిసే జరుగుతాయి.
ఈ గిరిజన తెగలు ఘోతుల్ అనే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఘోతుల్ అంటే పెద్ద పెద్ద వెదురు బొంగులతో చేసిన డార్మిటరీ. యువతీ యువకులు ఒకరినొకరు తెలుసుకుని.. సరదాగా గడపడానికి ఘోతుల్ కు వెళ్లవచ్చు. 10ఏండ్లు నిండినప్పటి నుంచే తల్లిదండ్రులు వారిని ఘోతుల్ కు పంపడం ప్రారంభిస్తారు.
ఘోతుల్ లోకి వెళ్లి ఏదైనా చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఘోతుల్ లో ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత.. యువతీ యువకుల వివాహానికి ముందే ఒకరితో ఒకరు శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శృంగారంలో పాల్గొనవచ్చు. ఎలాంటి సామాజిక ఒత్తిడి లేకుండా తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వీరికి ఉంటుంది.
ఘోతుల్ లో పాటలు పాడుతూ ఒకరితో ఒకరు డ్యాన్స్ లు చేస్తుంటారు. యువకులు తమకు నచ్చిన యువతి కోసం ప్రత్యేకంగా వెదురు బొంగుతో తయారు చేసిన దువ్వెనలను ఇస్తుంటారు. ఆ దువ్వెనలు ఆమె తలలో ఉంచుతారు. ఒకవేళ ఆ యువతి దానిని ఇష్టపడితే అలాగే జుట్టులో ఉంచుకుంటుంది. అప్పుడు వారిద్దరు కలిసి జీవించవచ్చు.
కొన్ని నెలల తర్వాత కూడా వీరిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటే.. వారికి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేస్తారు. సహజీవనం చేసిన తర్వాత కొందరు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా గర్భంతోనే పెళ్లి పీటలు ఎక్కినవారు అక్కడ ఎంతో మంది ఉంటారు. ఈ సంప్రదాయం కారణంగా ఆ గిరిజన ప్రాంతంలో లైంగిక వేధింపులే ఉండవని స్థానికులు చెబుతారు.