Smart Phone : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేని జీవితం ఊహించలేనిదిగా మారింది. అయితే, ఈ ఫోన్ల వాడకాన్ని అతిగా చేసుకుంటూ, యువత తమ జీవితాలను అర్థరహితంగా మార్చుకుంటున్నారని ఓ మహిళ తన పాట ద్వారా హితబోధ చేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటలో, యువత ఫోన్లలో మునిగిపోయి తమ భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని, అభివృద్ధి సాధించాల్సిన సమయాన్ని ఫోన్లలో వృథా చేయకూడదనే సందేశాన్ని అందులో ప్రతిబింబించారు.
ఈ పాటలోని పదాలు ఎంతో గుణపాఠంగా ఉండడంతో పాటు, చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఫోన్ వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, మన జీవితాన్ని మెరుగుపరచే విధంగా ఉపయోగించుకోవాలని ఈ పాట సారాంశంగా చెబుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిపై విస్తృతంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పాటలు నిజంగా అవసరం’’, ‘‘స్మార్ట్‌ఫోన్ వల్ల యువత తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతున్నారు’’ వంటి కామెంట్లు పెద్ద ఎత్తున వచ్చాయి.
నేటి యువతలో ఫోన్లపై అధిక ఆసక్తి, సోషల్ మీడియా వ్యసనం పెరిగిపోతున్న సమయంలో, ఈ పాట మరింత మందికి చైతన్యం కలిగించేందుకు సహాయపడుతుందేమో చూడాలి!