Dr. Jai Yalamanchili : జై గారు కలిసిన వారంతా గెలిచారు.. జై మాటే నిజమైంది..

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili

Dr. Jai Yalamanchili : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎవరికి వారు వారి వారి అభిప్రాయాలు వెలువరించారు. కొందరు సెలబ్రెటీ జ్యోతిష్యులు కూడా వారు అనుకున్నది చెప్పారు. కేవలం నోటితో చెప్పవడం కాదు.. అక్కడి పరిస్థితులు, గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల మనసులో ఏమనుకుంటున్నారన్న దాన్ని విశ్లేషించి చెప్పాలి. అలా చాలా సర్వే సంస్థలు చెప్పినా కొన్నింటి అంచనానే నిజమైంది. అందులో అక్యురేట్ గా ఏవీ లేవు. కానీ డాక్టర్ జై జదీష్ బాబు యలమంచిలి యూ బ్లడ్ యాప్ ఫౌండర్ గారు ఇచ్చిన ప్రిడిక్షన్ నూటికి నూరుపాళ్లు నిజమైంది.

యూ బ్లడ్ లాంటి యాప్ లతో పాటు స్వతహాగా సాంఘిక కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తి జై జగదీష్ గారు. యూఎస్ లో ఉంటూ తను పుట్టిన ఆంధ్రదేశానికి సేవ చేస్తున్నారు. ఆయన చేపట్టిన సాంఘిక కార్యక్రమాలపై ప్రజలు నుంచి ప్రశంసలు దక్కుతాయి. అమెరికాలో ఎన్ఆర్ఐ గా ఉంటూ అక్కడికి వెళ్లే తెలుగు వారికి అండగా ఉంటారు ఆయన. వారి బాగోలు, మంచి చెడ్డలు చూసుకుంటూ విదేశాల్లో సైతం తమ వారు ఉన్నారన్న భావన కలిగిస్తారు.

సాంఘిక కార్యక్రమాలతో బిజీగా ఉండే జై గారు రాజకీయ పార్టీఅయితన టీడీపీని అభినందిస్తారు. అన్న ఎన్టీఆర్ కు వీరాభిమాని. అన్నగారి ఉపాన్యాసాలు వింటూ, సినిమాలు చూస్తూ అదే స్ఫూర్తితో పెరిగారు. అందుకే ఆయన అన్నా.. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ అన్నా జై గారికి ప్రత్యేక అభిమానం.

రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం మొదటి టర్మ్ లో ముఖ్యమంత్రి కావడంతో హర్షం వ్యక్తం చేసిన జై గారు తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో మార్పుతో ఏం జరుగుతుందో చూడాలనుకున్నారు. కానీ జగన్ పాలన అంతా అచాచకం.. అవినీతితో సాగడంతో తీవ్ర ఆవేదన చెందారు. చంద్రబాబు నాయుడిని జైలుకు పంపడం మరింత కుదిపేసింది. ఆ సమయంలో జైగారు యూఎస్ఏ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్నికలకు ముందు జై గారు కలిసిన నాయకులు అందరూ టీడీపీలో విజయం సాధించారు. వంగలపూడి అనిత, గంటా శ్రీనివాస్ రావు, కోడె ప్రసాద్ తో పాటు కొంత మందిని జై గారు కలిశారు. అక్కడి గ్రౌండ్ రిపోర్టును తెలుసుకున్న జై గారు వారంతా గెలుస్తారని ముందే చెప్పారు. ఆయన ప్రిడిక్షన్ నిజమైంది. జై గారు కలిసిన వారందరూ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక చంద్రబాబు నాయుడు జైలులో పడిన సందర్భంగా ఏపీలో టీడీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. 

TAGS