Rani Rudrama Devi : మే 13న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొవాలి – ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రాణి రుద్రమ దేవి
Rani Rudrama Devi : మే 13వ తారీకున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రాణి రుద్రమ దేవి కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఆమె మే 13న ఓటుహక్కు వినియోగించుకోవాలని, గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది అనేది విశ్లేషించుకొని, భవిష్యత్తు ఎలా ఉండాలి, మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే ఓటుతోనే సాధ్యమవుతుందని అన్నారు.
భవిష్యత్తులో మంచి రాజధాని ఉండాలని, మీకు మంచి జరగాలని మీరు కోరుకుని ఉంటారని, ఆ కోరికలు నెరవేరాలంటే మీ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరందరూ తప్పనిసరిగా తమ తమ గ్రామాలకు కుటుంబాలతో సహా వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
TAGS AP Elections 2024ChilakaluripetLavu Sri Krishna DevarayaluMay 13 VotesRani Rudrama DeviTDPTDP Janasena BJP VS YCP