Allu Arjun : అల్లు అర్జున్ కామెంట్స్ తో అందరూ షాక్.. స్నేహరెడ్డిని ఎమన్నాడంటే
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. పుష్ప సినిమా పెద్ద హిట్ కావడం తగ్గేదెలే డైలాగ్ ఫేమస్ కావడంతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అంటే క్రేజీ స్టార్ గా మారిపోయారు.
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఆగస్టు 15 న విడుదల కానుంది. ఈ మూవీ కోసం సుకుమార్ అల్లు అర్జున్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆర్య మూవీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన విషయం తెలిసిందే. గంగోత్రి తర్వాత ఆర్య అల్లు అర్జున్ కు సెకండ్ మూవీ. ఆర్య లో వన్ సైడ్ లవర్ గా నటించి అలరించాడు. ఆర్య విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా.. ఈవెంట్ నిర్వహించారు.
అల్లు అర్జున్ ను ఈవెంట్ లోని యాంకర్ ఒక ప్రశ్న అడగ్గా.. ఆయన ఇచ్చిన సమాధానంతో అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు. అల్లు అర్జున్ మూవీలో కూడా వన్ సైడ్ లవ్ ట్రాక్ ఉందా అని ప్రశ్నించడంతో ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ విస్మయానికి గురి చేసింది. నా లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహ రెడ్డితోనే అని చెప్పడంతో ఈవెంట్ లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
అల్లు అర్జున్ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించలేదు. వన్ సైడ్ లవ్ భార్య తో ఎలా సాధ్యమంటూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆర్య తర్వాత ఆర్య 2 లాంటి మూవీస్ తో కూడా ప్రేక్షకులను అలరించిన బన్నీ.. ఆ తర్వాత తెలుగులో టాప్ హిరోగా అనేక సక్సెస్ మూవీస్ చేశాడు. ఈ స్టైలిష్ స్టార్ పుష్ప 2 మూవీ కోసం తెలుగులోనే కాకుండా ఓవరాల్ ఇండియాలో కూడా ఎక్కువ మంది వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.