ఎందుకు డబ్బు ఇస్తుందంటే?
అభిషేక్ కు ముంబైలోని జుహులో భారీ విలాసవంతమైన అపార్టుమెంట్ ఉంది. దాన్ని ఆయన రూ. 280 కోట్లతో కొన్నారు. ఈ అపార్టుమెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ను ఆయన ఎస్బీఐకి లీజు ఇచ్చారు. 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ నెలకు రూ. 18.9 లక్షలు కిరాయి రూపంలో చెల్లిస్తుంది. ఈ డబ్బు ప్రతి నెలా అభిషేక్ అకౌంట్ లో జమ అవుతుంటాయి. ఎస్బీఐతో ఈ లీజు విషయం ఇటీవల బయటపడింది. ఇందులో అద్దె పెంపునకు నిబంధనలున్నాయి. ప్రస్తుతం నెలకు రూ. 18.9 లక్షలు, 5 సంవత్సరాల తర్వాత రూ. 23.6 లక్షలకు పెరుగుతుంది. పదేళ్లకు రూ. 29.5 లక్షలకు చేరుతుంది. నివేదికల ప్రకారం ఆయన ఎస్బీఐకి 3,150 చదరపు అడుగుల ప్లేస్ రెంట్ ఇచ్చారు.
అభిషేక్ బచ్చన్ గురించి..
అమితాబ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు అభిషేక్ బచ్చన్. ‘గురు’, ‘ధూమ్’, ‘బంటీ ఔర్ బబ్లీ’ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. సినిమాలతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. కొన్ని స్పోర్ట్స్ టీముల్లో వాటాలు ఉన్నాయి. వ్యక్తి గత జీవితంలో 2007లో ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకున్నారు. ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది.