Voter Card : ఓటరు కార్డు లేకున్నా పర్వాలేదు ఓటు వేయవచ్చు : సీఈవో

Without Voter Card Comments CEO
Voter Card : ఎన్నికల్లో ఓటు కోసం దరఖాస్తు చేసిన వారికి నెలా ఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఓటర్ కార్డు లేదని ఓటు వేయడానికి రాకుండా ఉండకూడదని ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేసుకునే వెసులుబాటు భారతీయ ఎన్నికల సంఘం కల్పించిందని ఆయన తెలిపారు.