CM Revanth : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు అందించే ఉచిత వైద్యం పరిధిని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచేసింది.
ఆరోగ్య శ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలా మంది ఈ పథకానికి దూరం అవుతున్నారని గుర్తించిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని నివేదికను తమకు అందజేయాలని రేవంత్ సర్కార్ అందజేయాలని రేవంత్ సర్కార్ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ కాకపోవడం అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడం, కుటుంబాలు విడిపోవడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఫ్రీగా అందే లక్షల విలువైన వైద్యం రేషన్ కార్డుల వల్ల అందకుండా పోతోందని పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నష్టపోతున్నారని గుర్తించింది.
ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ అమలుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకోగా అందులో ముఖ్యమైనది ఇది. దీంతో పాటు అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.