BJP Party Abyss In AP : పదంటే పది సంతకాలు కూడా కరువు.. ఏపీలో మరింత అగాధంలోకి బీజేపీ!
BJP Party Abyss In AP : భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో గడ్డు కాలం నడుస్తోంది. అధ్యక్షుల మార్పులో భాగంగా సోము వీర్రాజు చేతిలోని పార్టీ ఏపీ స్టీరింగ్ ను పురంధీశ్వరికి అప్పగించింది పార్టీ. ఇక ఏపీలో కమలం దూసుకెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితి మరోలా కనిపిస్తుంది. పార్టీ దూసుకుపోవడం పక్కన పెడితే కనుమరుగయ్యేలా కనిపిస్తుంది. బీజేపీని ఏపీలో ఎవరూ పట్టించుకోవడం లేదు.
తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిందని భావించిన ఏపీ ప్రజలు బీజేపీని కూడా దరి చేరనివ్వలేదు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం.. తమ ప్రియతమ నేత చంద్రబాబు ఏపీ సీఎం పీఠం ఎక్కడం, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో బీజేపీ ఏపీలో మరింత నష్టపోతూ వచ్చింది. పార్టీని పట్టించుకునే వారు కరువయ్యారు.
జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుధీర్ఘంగా బీజేపీతో పొత్తులో ఉండడంతో పార్టీ పేరు అప్పుడప్పుడు వినిపించేది. కానీ పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో బీజేపీ వెనకే ఉంటూ వస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఉంటుందని చెప్పడంతో బీజేపీని కూడా కలుపుకొని పోవాలని పవన్ భావిస్తున్నాడు.
ఇవన్నీ పక్కన ఉంచితే ఇటీవల ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీకి అనుకూలుల సంతకాల సేకరణ ప్రారంభించింది. అయితే ఎంతో మంది తమకు అనుకూలంగా వస్తారని అనుకుంది. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం పదంటే.. పది సంతకాలు కూడా లేవు. దీంతో పార్టీ బిక్కమొహం వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో అందరూ బీజేపీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.