Indiramma houses : రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు
Indiramma houses : రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ శ్రేణులు, అధికారుల సంయుక్త సమావేశం మంత్రి హాజరై మాట్లాడారు. మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలుగా పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. గ్రామాల్లో వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు.