JAISW News Telugu

Vijay Devarakonda-Rashmika : విజయ్ దేవరకొండను పార్టీ అడిగినా రష్మిక.. దేనికోసమబ్బా..

Vijay Devarakonda-Rashmika

Vijay Devarakonda-Rashmika

Vijay Devarakonda-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే. గీతగోవిందం మూవీలో కలిసి నటించిన ఈ జంట ఇప్పటికీ తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగినా ఈ జంట ఆ విషయాన్ని కొట్టిపారేయలేదు..అలాగని నిజమే అని చెప్పుకోలేదు. మొత్తానికైతే వీరి స్నేహం కొనసాగుతోంది.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.  పరుశురామ్ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి వస్తోంది. మూవీ యూనిట్ గురువారం ట్రైలర్ విడుదల చేసింది. దీనిని చూసిన రష్మిక టీమ్ ను మెచ్చుకుంటూ ట్విటర్ లో ట్వీట్ చేసింది.

తనకెంతో ఇష్టమైన విజయ్, పరశురామ్.. ఫ్యామిలీ స్టార్ తో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొంది. ఈ సినిమా కోసం అతృతగా ఎదురుచూస్తున్నానని, మీరు తప్పకుండా హిట్ కొడుతారని..పార్టీ ఇవ్వాలని మరి కోరింది. దీనిపై విజయ్ స్పందిస్తూ ‘క్యూటెస్ట్’ అని రిప్లై ఇచ్చారు.

తిరుపతిలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ‘‘స్వామి వారి దర్శనం కోసం ఇప్పటికే చాలా సార్లు తిరుపతికి వచ్చా. ఈ ప్రాంతం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నా.. పరశురామ్ తో ఇప్పటికే గీతగోవిందం చేశా. దానిని మించి ఈ సినిమా ఉండబోతోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా అన్నీ ఉన్న మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ వేసవి సెలవుల్లో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రిలీజ్ తర్వాత మీ అందరినీ కలుస్తా’’ అని అన్నారు.

లైగర్ పరాజయం తర్వాత హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన గత చిత్రం ‘ఖుషి’కి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో ఆయన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ పైనే పెట్టుకున్నారు. ఇందులో విజయ్ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచాయి.

Exit mobile version