Jayalalitha : శరతబాబును పెండ్లి చేసుకోవాలనుకున్నా.. జయలలిత సంచలన కామెంట్స్
Jayalalitha : నటి జయలలిత మంచి కార్యెక్టర్ అర్టిస్ట్, పాత సినిమాల్లో ఆమె అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నది. నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలు ఎక్కువగా నటించింది. అయితే ఇటీవల ఆమె కొన్ని యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది.
తాను గతంలో శరత్ బాబును ప్రేమించానని, ఇద్దరం పెండ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని చెప్పారు. ఇద్దరు పెండ్లి చేసుకునేందుకు గుడికి కూడా వెళ్లారట. అయితే ఇండిస్ర్టీకి చెందిన వారు తమ వివాహాన్ని అడ్డుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేరు పెట్టుకున్నందుకు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. అమ్మ పేరు పెట్టుకొని కామెడీ వేషాలు వేయొద్దంటూ ఆ పార్టీ వాళ్లు తనను బెదిరించారని చెప్పుకొచ్చింది. అయితే వాటినేం తాను లెక్క చేయలేదని చెప్పుకొచ్చింది. ఇండస్ర్టీలో తనకు వరుస అవకాశాలు ఇచ్చింది వంశీ గారేనని చెప్పుకొచ్చింది. అయితే శరత్ బాబును పెండ్లి చేసుకొని పిల్లలను కూడా కనాలని అనుకున్నానని, కానీ తానొకటి అనుకుంటే , జీవితం మరోలా మారిందని చెప్పింది. ఇద్దరం విడిపోయాకే తెలిసింది.. తాను శరత్ బాబును ఎంతో ప్రేమించానని చెప్పింది. ఇక శరత్ బాబు రమాప్రభను వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక క్యారెక్టర్ అర్టిస్ట్ గా ఎన్నో సంచలన సినిమాల్లో జయలలిత నటించింది. ప్రేక్షకుల ఆదరణ పొందింది. హైదరాబాద్, మద్రాస్ తిరుగుతూ అనేక సినిమాల్లో తనదైన పాత్రలు పోషించింది. ఇక తాజాగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది.