JAISW News Telugu

Rishabh Pant : రిషబ్ పంత్ కు అలా అయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా..  రవిశాస్త్రి 

Rishabh Pant : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీం ఇండియా పాకిస్థాన్ పై ఉత్కంఠ పోరులో గెలవడంతో అందరూ సంబరాల్లో మునిగిపోయారు. అయితే వన్డే వరల్డ్ కప్ లో ఇచ్చినట్లే మళ్లీ ఫీల్డింగ్ కోచ్ మ్యాచ్ అనంతరం అనాలసిస్ చేసి ఎవరెవరూ బాగా ఆడారో వారందరిని పేరు పేరున  పిలిచి అభినందించాడు. మ్యాచ్ లో వారి గణాంకాలు, వారు ఆడిన తీరు తదితర వివరాలను తెలిపాడు.

అంతేకాకుండా టీం ఇండియా మాజీ కోచ్, క్రికెటర్ రవిశాస్త్రిని టీం ఇండియా డ్రెస్సింగ్ రూంకు ఆహ్వానించారు. దీంతో డ్రెస్సింగ్ రూం చప్పట్లతో మారు మోగి పోయింది. రవిశాస్త్రి వస్తూనే ఇండియా ప్లేయర్లకు అభినందనలు తెలిపాడు. పాకిస్థాన్ పై ఆడిన తీరును మెచ్చుకున్నాడు. ఒకానొక దశలో వెనకబడి పుంజుకున్న తీరు అమోఘమని అప్రిషీయేట్ చేశాడు.

రిషబ్ పంత్ కు కారు యాక్సిడెంట్ అయి ప్రాణా పాయ స్థితిలో కాళ్లు విరిగిపోయి చేతకాని దశలో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు. అలాంటిది రిషబ్ పంత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో రాణించి ఎక్కువ స్కోరు చేయడం ఆనందంగా ఉందన్నాడు. రిషబ్ పంత్ క్రికెట్ లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రియల్ చాంపియన్ అని కొనియాడాడు.

రిషబ్ పంత్ ఆటతీరు గురించి పొగిడారు. అంతకుముందు ఇండియా పీల్డింగ్ కోచ్ పరాస్ మాంబ్ర మ్యాచ్ విన్నర్ల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించాడు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన బాబర్ క్యాచ్ విలువేంతో అందరికీ తెలిసిందేనన్నాడు. అర్షదీప్ లాస్ట్ ఓవర్ పై ప్రశంసలు కురిపించాడు. రిషబ్ పంత్ చేసిన 42 పరుగులు మ్యాచ్ విజయానికి కారణమని టీం ఇండియా క్రికెట్ టీంలో ఉండటం చాలా అదృష్టమన్నాడు. జస్ ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు మ్యాచ్ గమనాన్నే మార్చేశాయని చెప్పాడు. మొత్తం మీద టీం ఇండియా మళ్లీ మెడల్స్ బాట పట్టింది. గత వన్డే వరల్డ్ కప్ లో ఎవరూ మంచి పర్ఫామెన్స్ చేస్తే వారికి మెడల్ ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం అదే బాటలో పయనిస్తోంది.

Exit mobile version