Surekha Vani : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా సురేఖ వాణికి మంచి గుర్తింపు ఉంది. నటనే కాదు కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది ఆమెది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించడం లేదు కానీ కరోనా తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. సురేఖ, ఆమె కూతురు ఇద్దరికీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఇద్దరు చేసే సందడికి బ్యాడ్ కామెంట్స్ కూడా పుష్కలంగా వస్తుంటాయి. మోడ్రన్ లుక్ లో తల్లీకూతుళ్ల రచ్చ అంతా ఇంతా కాదు. సమయం దొరికినప్పుడల్లా పబ్ లు, ట్రిప్స్, వెకేషన్స్ అంటూ దుబాయ్, గోవా చెక్కెస్తూ ఉంటారు. అలా వారు షేర్ చేసే ఫొటోలు, వీడియోలు విపరీతంగా ట్రోల్స్ కు గురవుతుంటాయి.
తనపై వచ్చే ట్రోల్స్ పై తాజాగా సురేఖ వాణి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.. తన పేరు చెప్పుకుని డబ్బు సంపాదించుకుంటున్నారులే అని లైట్ తీసుకున్నానని చెప్పింది. ప్రశాంతమైన జీవితం ఇవ్వమని దేవుడిని కోరుకుని గుండు చేయించుకున్నట్లు తెలిపింది. అందరికంటే ముందు తన కూతురు సుప్రీత నా లుక్ బాగుందని చెప్పిందని సురేఖ చెప్పుకొచ్చింది.
‘‘మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని, అందుకే అలా తిరుగుతుందని కొందరు కామెంట్ చేస్తుంటారు.. కానీ నాకు చిన్న వయస్సులోనే పెళ్లి అయిపోయింది.. అప్పుడు ఎక్స్ పోజర్ లేదు.. ఇప్పుడు ఎక్స్ పోజర్ వచ్చింది. నా మొగుడున్నా ఇలాగే తిరిగేవాళ్లం..మొదట్లో ఈ ట్రోలింగ్స్, కామెంట్స్ తో చాలా బాధపడేదాన్ని. తర్వాత వాడెవడో అంటే మనం రియాక్ట్ అవడం వేస్ట్ అనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నా’’ అని తెలిపింది.
ఆర్జీవీతో దిగిన ఫొటోల మీద డిబేట్లు పెట్టి ఇష్టమొచ్చినట్టుగా రాశారని చెప్పింది. తన పేరు చెప్పుకుని బతుకుతున్నారు, పిచ్చి నా కొడుకులు అని, ప్రస్తుతం అటువంటివి పట్టించుకోవడం లేదన్నారు.