YS Jagan : ఓడిపోయినా జగన్ కు ప్రజా గ్రహం తగ్గడం లేదు..!
YS Jagan : అధికారంలో ఉన్న సమయంలో ప్రజాగ్రహానికి గురైతే.. అధికారం కోల్పోయాక వారి గతి ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్థం అవుతుంది. కుర్చీ ఇచ్చారు కదా.. అని అహంకారంతో విర్ర వీగుతూ ఇష్టం వచ్చిన జీవోలు ఇస్తూ ప్రజలను పట్టించుకోకుండా.. అమాత్యులు ఆగడాలను చూసీ చూడనట్లు వ్యవహరించారు జగన్. ఇక, ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆయనపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
ఇన్నాళ్లు పాలక పక్షంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈ రోజు ఆ పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే వచ్చారు. కానీ పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండడంతో తన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సభకు హాజరయ్యారు.
అసెంబ్లీ లోపల, బయట ఆయనను కూటమి ఎమ్మెల్యేలు, ప్రజలు ఎగతాళి చేశారు. అసెంబ్లీ గేటు వెలుపల వైఎస్ జగన్ ను చూసిన వెంటనే ప్రజలు ‘జగన్ మామయ్య’, ‘జగన్ బై బై’ అంటూ నినాదాలు చేశారు. జగన్ కు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం అని కొందరు వైసీపీ సానుభూతి పరులు అంటున్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన వారి పట్ల సానుభూతి ఉంటుంది. దీంతో పాటు గౌరవ మర్యాదలు కూడా ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా కాదు.
ఐదేళ్ల జగన్ పాలనతో ఏపీ ప్రజలు విసిగి, వేసారిపోయారు. ఆయన పాలన ఎంత అరాచకంగా సాగిందో అందుకే ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడి వైపే మొగ్గు చూపారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత కూడా టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
జగన్, ఆయన వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రత్యర్థి నేతలను, ప్రజలను చిన్నచూపు చూశారు. ఇప్పుడు అవతలి వైపు నుంచి కూడా అదే అనుభవం ఎదురవుతోంది. నిజానికి కర్మ ఒక బూమరాంగ్.