Tabu : 52 ఏళ్లలో కూడా టాప్ గేర్ లో దూసుకుపోతున్న టబు.. అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటున్న సుందరి..

Tabu

Tabu

Tabu :  ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న తారలు ఒకటి, రెండు సినిమాలు చేయడంతోనే ఫేడవుట్ అవుతున్నారు. దర్శక, నిర్మాతలకు బోరు కొట్టి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నారు. పాపం వారు ఛాన్సుల కోసం ఎదురి చూస్తూ ఇన్ స్టా లో రీల్స్, పిక్స్ షేర్ చేస్తూ కాలం గడుపుతారు. చివరికి పెళ్లి చేసుకొని ఆ సినిమాలో నేను హీరోయిన్ అని పుట్టిన వారికి చూపెట్టుకుంటున్నారు.

కానీ కొందరు దీనికి భిన్నంగా ఉంటారు. దశాబ్ధాల పాటు పాతుకుపోతారు. గతంలో సావిత్రీ, తర్వాత శ్రీదేవి ఇలా కొందరు ఉంటారు. వీరి కోవకే వచ్చే నటి టబు (తబస్సుమ్ ఫాతిమా హష్మీ). 1985లో ముఖానికి రంగు వేసుకున్న ఈ నటి 39 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉంది. 1985లో హమ్ నౌజవాన్ తో చిన్న పాత్రను పోషించిన ఈమె 1991లో ‘కూలి నెంబర్ 1’తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె ప్రయానికి బ్రేకులు లేవు. జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్, భారత అత్యంత గౌరవ పురస్కారం పద్మశ్రీ కూడా అందుకుంది.

తెలుగులోకి రీఎంట్రీ
టాలీవుడ్ లో ఆమెకు ఆశించిన సినిమాలు రాలేదు. ‘పాండురంగడు’ తర్వాత ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన  ‘అల.. వైకుంఠపురములో’తో రీఎంట్రీ ఇచ్చింది. డీసెంట్ రోల్‌తో ఆకట్టుకుంది. దీని తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

గ్లామర్‌తో ఆఫర్లు
బాలీవుడ్ లో వరుస మూవీలు చేస్తూ వస్తున్న టబు.. ‘అంధాధున్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత అడల్ట్ కంటెంటైన ‘ఏ సూటబుల్ బాయ్’లో నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్ అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. దీంతో గ్లామరస్ రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింది.

ఇప్పుడు ఆ సినిమాలు
ప్రస్తుతం టబుకు 52 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆమెలో యాక్టింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ‘దృశ్యం2’లో సైతం నటించిన టబు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ‘భూల్ భులయా’లో నటించింది. ఈ ఏడాది అప్పుడే ‘కుత్తే’, ‘భోళా’, ‘ఖుఫియా’లో నటించింది. ఇప్పుడు The Crew వంటి సినిమాల్లో కనిపించింది.

క్లీవేజ్ షోతో
బోల్డ్ హీరోయిన్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్న టబు రీసెంట్ గా ఒక ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది ఇన్ స్టాను షేక్ చేస్తుంది. ఇందులో ఆమె డీప్ నెక్ డిజైన్‌తో డ్రెస్‌లో కనిపించింది. టబు ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. ఆమె అందాలు నెటిజన్లను రెచ్చగొడుతున్నాయి.  

TAGS